ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.
అలాగే సుకుమార్, అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా ఓ బాలీవుడ్ స్టార్ తనతో సినిమా చేయాలని సుకుమార్ ను కోరాడట. ఆ స్టార్ మరెవరో కాదు. అక్షయ్ కుమారట.
ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే చెప్పారు. అక్షయ్‌కుమార్ పుష్ప చిత్రం చూశారు. సినిమా తనకు బాగా నచ్చడం వల్ల అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు.
ఆ తర్వాత అక్షయ్ స్వయంగా సుకుమార్‌కు ఫోన్ చేసి మెచ్చుకున్నారట. తనతో ఒక సినిమా చేయాలని కోరారట. ఆ సమయంలో అక్షయ్‌తో మాట్లాడటం సంతోషంగా అనిపించిదని, భవిష్యత్తులో కచ్చితంగా అక్షయ్ తో సినిమా చేస్తానని పేర్కొన్నారు.