స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వన్ నేనొక్కడినే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ సుకుమార్ టేకింగ్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చేందుకు రూపకల్పన జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.
ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా సుకుమార్ బర్త్ డే సందర్భంగా మహేష్ ఆయనకు విషెస్ తెలిపారు. తను పనిచేసిన అత్యుత్తమ దర్శకులలో ఒకరు సుకుమార్ అంటూ ప్రశంసించాడు. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ వీరి సినిమా పై చర్చలు ఊపందుకున్నాయి. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్నాడు.
Happy birthday to one of the most talented filmmakers I've worked with @aryasukku! Wishing you happiness and good health always. 🤗 pic.twitter.com/NDSEUH9o39
— Mahesh Babu (@urstrulyMahesh) January 11, 2021