పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు. సుకుమార్ కు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం పుష్ప పార్టు2 ను సిద్ధం చేయడంలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతుందట.
సుకుమార్, చిరంజీవి కలిసి నటించాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు చిరు మళ్లీ యాక్షన్‌లోకి రావడం, వరుస సినిమాలను లైన్ లో పెట్టడం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే సుకుమార్ ను కూడా లైన్ లో పెట్టేశాడట.అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, పుష్ప పార్ట్-2 తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పూరీతో కలిసి జన గణ మన సినిమా చేయబోతున్నాడు.