ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం మార్చి 4న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించారు. శర్వానంద్ హీరోగా రష్మిక మందన్నహీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.చెరుకూరి సుధాకర్ నిర్మించారు.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి శర్వా, సుధాకర్‌లతో పడి పడి లేచే మనసు సినిమా హీరోయిన్ సాయి పల్లవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దర్శకుడు సుకుమార్ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సుక్కు మాట్లాడుతూ ఆడవాళ్ళు మీకు జోహార్లు టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేజ్ పైన ఉన్న ఒక్కొక్కరి పేర్లు చెబుతుండగా సాయి పల్లవి పేరును సుకుమార్ చెప్పగానే ప్రేక్షకులు ఒక్కసారిగా ఈలలు, అరుపులు మొదలు పెట్టారు.
సాయి పల్లవికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సుకుమార్ షాక్ అయ్యాడు. అంతే కాదు నాకు తెలిసి మీరు లేడీ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ మాటతో అభిమానులు మరింత పెద్ద ఈలలు వేశారు.
#SaiPallavi Mass 🔥 pic.twitter.com/NQWINw3AWe
— OverSeasRights.Com (@Overseasrights) February 27, 2022
Advertisements