ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమ కనకాలకి మొదట కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఇతర స్టార్ హీరోయిన్లను ప్రశంసించారు.
సమంత ఇక్కడ కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మిక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ హీరోయిన్లు అని అన్నారు సుకుమార్. అయితే సాయి పల్లవి గురించి సుకుమార్ మాట్లాడుతున్నప్పుడు, ప్రేక్షకులు నాన్‌స్టాప్‌గా అరుస్తూనే ఉన్నారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్తూ సాధారణంగా తాను పనిచేసే సినిమాల గురించి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఏఎమ్‌జే చాలా ప్యాషన్‌తో రీ-రికార్డింగ్ చేశానని నాకు చెప్పాడని తెలిపారు.
ఏఎమ్‌జే దర్శకుడు కిషోర్ తిరుమల అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సున్నిత మనస్కుడు, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా మార్చి 4న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.