సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతిపై సినీ ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళి అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ కొన్ని వాక్యాలను షేర్ చేస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళి అర్పించారు.
గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై, అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బ్రతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. మీరు ఎప్పటికి రాయని పాటలాగ మేం మిగిలిపోయాం అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.