శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4న థియేటర్లలోకి రానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఇకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారట.అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు.