తెలుగు వినోద పరిశ్రమలో నెంబర్ వన్ యాంకర్‌గా సుమ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తన వాక్చాతుర్యంతో బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూనే, సినిమా ఈవెంట్లలో హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక, చాలా కాలం తర్వాత సుమ లీడ్ రోల్‌లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమాతో వెండితెరపై సందడి చేయనుంది.
ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది సుమ. ఈ నేపథ్యంలోనే సుమ ఆలీ చేస్తున్న ఆలీతో జాలీగా టాక్ షోకు హాజరైంది. ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘కరోనా సమయంలో మీ వివాహ బంధంపై రూమర్స్ వచ్చాయి, మీరు విడిపోతున్నారంటూ.. వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని అందరూ అన్నారు.. అది నిజమేనా’ అని ప్రశ్నించారు ఆలీ. అందుకు సుమ స్పందించారు.
Advertisements
‘ఇద్దరి మధ్య గొడవలు వాస్తవమే. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు వచ్చాయి. కానీ ఒకటి మాత్రం నిజం. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టం’ అంటూ సుమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అలాగే, తన కొడుకు త్వరలోనే హీరోగా పరిచయం అవ్వబోతున్నాడని కూడా క్లారిటీ ఇచ్చింది.