గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సునిత పెళ్లిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కొంతమంది ధైర్యమైన నిర్ణయమని సునితను మెచ్చుకుంటుంటే…ఇంకొంత మంది ఇప్పుడు పెళ్లి అవసరమా అంటూ దీర్ఘాలు తీశారు. ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం కాబట్టి…మనమంతా స్వాగతించాల్సిన అవసరం ఉంది.
అతికొద్ది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అయితే సునిత కు క్లోజ్ ఫ్రెండ్ అయిన సుమ…. పెళ్లి సందర్భంగా సునితకు డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం!
ఇక సునిత పెళ్లి చేసుకున్న రామ్ …..గతంలో సునితకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాండిల్ చేసేవాడట! అంతేకాకుండా రామ్ సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా నిర్వహిస్తుంటాడట!