సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులు ఉన్నారు. ఎంత మంది కొత్త యాంకర్లు వచ్చినా.. సుమ స్థానం మాత్రం అలాగే ఉంటుంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయిన.. టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సుమ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లివస్తున్నాయి. తన గొప్ప మనసును చాటుకుంది సుమ. స్టార్ యాంకర్ సుమ ఇటీవల చెన్నైలోని ఓ కాలేజీకి వెళ్లి స్టూడెంట్స్ తో సరదాగా ముచ్చటించారు. నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను.. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.
‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’ అనే సంస్థ నా డ్రీమ్.. నాకు వచ్చేదాంట్లో నేను తినడమే కాదు నావంతుగా 30 మందిని దత్తత తీసుకున్నా. వాళ్లు సెటిల్ అయ్యే వరకు వాళ్లతో ఉంటాను అని తెలిపింది.
ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు అంటూ సుమ చెప్పుకొచ్చారు. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.