నటుడు రాజీవ్ కనకాల, సుమ విడిపోయినట్టు ఇటీవల సోషల్ మీడియా లో పుకార్లు వచ్చాయి.అయితే అవన్నీ తప్పుడు కథనాలు అని ఈ మధ్య ఏ గొడవ జరగలేదని ఇటీవలజరిగిన ఓ కార్యక్రమం ద్వారా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే సుమ ఓ ట్వీట్ చేశారు.
మై డియర్ రాజా… ఎప్పటికీ నా సంతోషం నీవే అంటూ ట్వీట్ చేస్తూ.. తన భర్త చేతిని పట్టుకుని, ఆయన భుజంపై తల వాల్చిన ఫొటోను షేర్ చేశారు. సుమ చేసిన ఆ ట్వీట్ కు నెటిజన్లు వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలకు నిదర్శనం ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm
— Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020