తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తుది ఘట్టానికి చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది. గెలుపు కోసం కంటెస్టెంట్లు ఒకరి ఒకరు తిట్టుకుంటున్నారు. మరోవైపు హౌస్ లోకి రోజుకో గెస్ట్ లను పంపుతున్నాడు బిగ్ బాస్. లాస్ట్ ఎపిసోడ్ లో విజయదేవకొండ వచ్చి రూమ్ మేట్స్ ని ఆశ్చర్య పరిచాడు. తాజాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో సుమ కనకాల రానుంది. స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో లో హౌస్ మేట్స్ నిద్రలేవకముందే సుమ వచ్చి బెడ్ పై పడుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంటి సభ్యులతో సుమ చేయించే వివిధ రకాల టాస్క్లతో, ఆటలతో ఈ ఎపిసోడ్ సాగనుంది.