టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో గురించే చర్చ జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న ఈ షో కి మంచి స్పందన రావడంతో ఆహా యాజమాన్యం కూడా స్టార్ హీరోలను ఈ కార్యక్రమానికి పిలుస్తుంది. ప్రభాస్ రావడంతో నిన్న ఈ షో రేంజ్ ఎక్కడికో వెళ్ళింది అనే చెప్పాలి. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు.
ప్రభాస్ షో దెబ్బకు ఆహాలో సర్వర్లు కూడా ఎగిరిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు ఆహా ఆగిపోవడం ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత స్లోగా ఆహా వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ షో కి కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందనే టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇదే తరహాలో మరో షో కూడా ప్రసారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం లో సుమ హోస్ట్ గా ఒకటి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే సుమ క్యాష్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువగా సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా సినిమా ఉంటేనే స్టార్స్ వస్తున్నారు అని అంటున్నారు. ఇలా కాకుండా ఒక ప్రముఖ ఓటీటీలో గ్రాండ్ గా ఆమె ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాలేజి స్టూడెంట్స్ ని కూడా దానికి పిలవాలని ప్లాన్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.