శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది జయమ్మ పంచాయితీ. ఎన్నో ఏళ్ల తర్వాత సుమ నటించిన ఈ సినిమా కనీసం శ్రీకాకుళంలో కూడా ఆడకపోవడం బాధాకరం. నిన్న రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ పడ్డాయి. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ బోర్ కొట్టేసిందనేది ప్రేక్షకుల మాట. దీంతో ఇన్నాళ్లు సుమ పడిన కష్టం వృధా అయింది.
సుమ నటనతో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఆకట్టుకున్నప్పటికీ.. నెరేషన్ నెమ్మదిగా సాగడం, బోరింగ్ ట్రీట్ మెంట్, బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం.. ఈ సినిమాను దెబ్బతీశాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేం. మరీ ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా కాదిది.
జయమ్మ పంచాయితీ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఓ విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో ఇన్నాళ్లూ సుమ పడిన కష్టం వృధా అయింది.
ఈ సినిమా కోసం తన టీవీ కార్యక్రమాల్ని సైతం వదులుకుంది సుమ. రోజుకు అటుఇటుగా 3 లక్షల రూపాయలు సంపాదించే ఈ స్టార్ యాంకర్.. ఓవైపు ఆ ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు, ఇటు ఫ్లాప్ అందుకుంది. ఈ దెబ్బతో మరోసారి ఆమె బుల్లితెరకే పరిమితం అయ్యేలా ఉంది.