‘పబ్‌లు’ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన కల్చర్ ఏమీ కాదని
కొన్ని వేల ఏళ్ల క్రితమే పుట్టి దడదడలాడించందని తాజా పరిశోధనలు బాంబ్ పేల్చాయి.దానికి సంబంధించిన పక్కా ఆధారాలు ఇటీవల ఇరాక్ లో బైటపడ్డాయి. పబ్ కల్చర్ అనేది ఆధూనిక మానవుడి అపర సృష్టి అని భావిస్తున్న నేటి జనరేషన్ కి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం ‘పబ్’లు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న చిన్న పట్టణాల్లోనూ పబ్ కల్చర్ పెరిగిపోతుంది. స్ట్రెస్ రిలాక్స్ కోసం చాలా మంది పబ్‌లకు వెళ్తుంటారు. అక్కడ తాగడం, డ్యాన్స్ చేయడం ఇక సర్వసాధారణం అయిపోయింది.
అయితే తాజాగా ఇరాక్‌లో జరిపిన తవ్వకాలో అందుకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. 5 వేల ఏళ్ల క్రితం నాటి ‘పబ్’ కు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి.
పిసా విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలకు చెందిన ఉమ్మడి బృందం ఈ శిథిలాలలో అలనాటి శీతలీకరణ వ్యవస్థకు సంబంధించిన అవశేషాలు, ఒక పెద్ద ఓవెన్, డైనర్‌ల కోసం బెంచీలు, దాదాపు 150 సర్వింగ్ బౌల్స్‌ను కనుగొన్నారు.
దక్షిణ ఇరాక్‌లో ఈ పబ్ అవశేషాలను కనుగోడం జరిగింది. ఇరాక్ సుమేరియన్ నాగరికత మొదటి పట్టణ కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. లగాష్ శిథిలాలలో యూఎస్-ఇటాలియన్ బృందం ఈ పురాతన అవశేషాలను కొనుగొంది.
‘ఈ తవ్వకాల్లో బయటపడిన బౌల్స్‌లో చేపలు, జంతువుల ఎముకలు కనిపించాయి. ఈ చారిత్ర ప్రదేశంలో రిఫ్రిజిరేటర్, సర్వ్ చేయడానికి వందలాది బౌల్స్, ప్రజలు కూర్చునేందుకు బెంచీలు, ఒక ఓవెన్ కూడా ఉంది.’ అని ప్రాజెక్ట్ డైరెక్టర్ హోలీ పిట్‌మాన్ తెలిపారు.ఇది చూడటానికి ప్రస్తుత పబ్ మాదిరిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రదేశంలో ఒకదానిలో బీర్ కూడా లభించిందని తెలిపారు.