తెలంగాణ లోని ప్రభుత్వమరియు ప్రైవేటు స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణప్రభుత్వం.ఇందుకు తెలంగాణ విద్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
2023 -24 విద్యా సంవత్సరం జూన్12 న ప్రారంభం కానుందని. అలాగే ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్ష సమయాలనుకూడా ప్రకటించింది విద్యాశాఖ.
ఏప్రిల్ 12 నుంచి 20 వరకు SA – II ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు అలాగే ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఉ.. 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆతర్వాత 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తారు. మరుసటిరోజు అంటే 25 వతేదినుండి సెలవులను ప్రకటించనున్నారు.