‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో కంబ్యాక్ హిట్ కొట్టిన సందీప్ కిషన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘A1 ఎక్స్‌ప్రెస్’. స్పోర్ట్స్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్‌లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకూ రాని హకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్` కావడం విశేషం. లవ్ అండ్ కమర్షియల్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, స్పోర్ట్స్ జానర్ లో నటించడం కూడా ఇదే మొదటిసారి. ధ్రువ ఫేమ్ హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. గత కొంత కాలంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయి, ఇటీవలే నాని నాగ చైతన్యలు ఈ జానర్ లో సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా విజయ్ విజిల్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. కథలో విషయం ఉండాలి, కథనం కన్వీన్సింగ్ గా ఉండాలే కానీ స్పోర్ట్స్ జానర్ అనేది మినిమమ్ గ్యారెంటీ… మరి సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్`తో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
నటీనటులు:
సందీప్ కిషన్, మురళీశర్మ, రఘుబాబు,
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
కెమెరా: కెవిన్ రాజు
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
ఆర్ట్: అలీ
కాస్ట్యూమ్ డిజైన్: హర్మన్
పి.ఆర్.ఒ: ఎల్.వేణు గోపాల్, వంశీశేఖర్