నటీనటులు: సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తదితరులు
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
దర్శకత్వం: రంజిత్ జయకొడి
సంగీతం: సామ్ సిఎస్
మాటలు: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి
సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం ఇటీవల విడుదలైన ట్రైలర్. అద్భుతమైన యాక్షన్, లవ్, మాఫియా అన్ని అంశాలు ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అయింది.
కథ: చిన్నప్పటి నుంచే పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలనే కలతో పెరుగుతాడు మైఖేల్. అనుకున్నట్టుగానే కొంచెం వయసు వచ్చిన తరువాత ఓ గ్యాంగ్ లో చేరుతాడు. అక్కడ తన పనితనంతో రోజు రోజుకు మంచి పొజిషన్ కి వెళ్తున్న సమయంలోనే.. అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు. తీర తన జీవితంలోకి వచ్చిన తరువాత మైఖేల్ లో వచ్చిన మార్పులు ఏంటి? అసలు తీర ఎవరు? తన గతం ఏంటి? అనేవి తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే: ‘ప్రస్థానం’ నుంచి ఇప్పటి వరకు సందీప్ కిషన్ చేసిన సినిమాలు చూస్తే.. కోపం ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. అందులో ఓ రకమైన మాస్ ఉంటుంది. ‘మైఖేల్’ మాఫియా బ్యాక్ డ్రాప్ కావడంతో మాసీగా చేసుకుంటూ వెళ్ళారు. గుండెల్లో అంతులేని బాధను బయటపెట్టలేని యువకుడిగా బాగా నటించాడనే చెప్పాలి. దివ్యాంశ కౌశిక్ ఓకే. మాఫియా డాన్ పాత్రలో గౌతమ్ మీనన్ నటన కంటే వాయిస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది.
‘మైఖేల్’తో వరుణ్ సందేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోవచ్చు. అనసూయ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. వరుణ్ సందేశ్ తల్లిగా, గౌతమ్ మీనన్ భార్యగా ఆవిడ కనిపించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించేది కాసేపే! ఉన్నంత సేపూ ఆయనకు ఇచ్చిన ఎలివేషన్ బావుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రోల్ కూడా కొత్తగా ఉండదు. కానీ విజయ్ సేతుపతితో ఆమె సీన్స్ బావుంటాయి.
మొత్తానికి మైఖేల్ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అనవచ్చు. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. ఆల్రెడీ చూసేసిన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. తొలుత కాస్త ఉత్కంఠగా అనిపించినా.. కొన్ని సన్నివేశాల తరువాత ఆ ఉత్కంఠని ఎక్కువ సేపు కొనసాగించలేకపోయారు. మధ్య మధ్యలో కొన్ని సాగదీసిన సీన్లతో అక్కరలేని డైలాగ్స్ తో ఇంటర్వెల్ వరకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మేకింగ్ స్టైల్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, సామ్ సిఎస్ సంగీతం కొంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ తర్వాత కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తుంది. కానీ కొత్త కథతో ఈ తరహా సినిమా తీస్తే రిజల్ట్ వేరే రేంజ్‌లో ఉండేది.