టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్లలో మహేశ్‌బాబు, త్రివిక్రమ్ జంట ఒకటి. అతడు ఖలేజా మూవీలతో సత్తా చాటిన వీరిద్దరూ.. త్వరలో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టడం ఇప్పటికే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ మూవీలోకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న యాక్టర్స్ ని రంగంలోకి దింపబోతున్నాడట మాటల మాంత్రికుడు.
ఆల్రెడీ మహేష్ బాబు కు జోడిగా పూజా హెగ్డే ను ఎంపిక చేయగా ఇప్పుడు విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి బడా స్టార్ సెలెక్ట్ చేసినట్టుగా టాక్ నడుస్తుంది.
బీటౌన్ స్టార్ సునీల్ శెట్టిని మహేష్ కి ప్రత్యర్థి పాత్రలో పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.సునీల్ శెట్టి ఇప్పటికే మోసగాళ్లు సినిమా లో యాక్ట్ చేయగా.. త్వరలో ఆయన నటించిన గని విడుదల కానుంది.