పొగాకు ఉత్పత్తుల ప్రకటనలకు నటించొద్దంటూ అభిమానుల నుంచి మన హీరోలకు విమర్శలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో హీరో సునీల్ శెట్టికి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రకటనలో హీరో సునీల్ శెట్టి నటించనేలేదు. ఈ విషయం లేట్‌గా గ్రహించిన ఆ నెటిజన్ చివరకు క్షమాపణలు కూడా చెప్పాడు. అనవసరంగా తనను ట్యాగ్ చేసినందుకు హీరో సునీల్ శెట్టి ఆ ట్వీట్‌కు ఇచ్చిన ఘాటు రిప్లై ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ట్విట్టర్‌లో, పాన్ మసాలా బ్రాండ్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో పోస్ట్‌కు ఓ నెటిజన్ హీరో సునీల్ శెట్టిని ట్యాగ్ చేసారు. అంతేగాక సునీల్ శెట్టిపై తీవ్ర విమర్శలు కూడా చేసారు. దీంతో ఆ ట్వీట్‌కు సునీల్ శెట్టి స్పందిస్తూ.. ‘మీ కళ్ళద్దాలను మార్చుకోండి, లేదా సరైన కళ్ళద్దాలను వాడండి’ అంటూ ఘాటుగా స్పందించారు.
తన పొరపాటును తెలుసుకున్న ఆ నెటిజన్ చివరకు సునీల్ శెట్టికి క్షమాపణ చెప్పాడు. ఇలాంటి విమర్శల నేపథ్యంలోనే తాను ప్రమోట్ చేస్తున్న పొగాకు ఉత్పత్తుల యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రకటించారు.
🙏
— Suniel Shetty (@SunielVShetty) May 9, 2022
నేటి యువతరంపై నటులు, క్రీడాకారుల ప్రభావం చాలా ఎక్కువ. అలాంటిది బాధ్యతాయుతంగా వుండాల్సిన వారు ఎవరేమైపోతే మాంకేటి అన్నట్టు వ్యవహరిస్తుండడంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, జర్దాలతో పాటు మద్యాన్ని ప్రోత్సహించేలా కొందరు నటులు, క్రీడాకారులు ఆ కంపెనీల ప్రకటనల్లో నటిస్తున్నారు. సినిమా స్టార్లు, క్రీడాకారులు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం వివాదాస్పదం అవుతోంది.