సింహ, లెజెండ్ వంటి హిట్ సినిమాలను తీసి ముచ్చటగా మూడోసారి రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మొదట సోనాల్ చౌహాన్ ను అనుకున్నప్పటికీ ఆమె నో చెప్పిందట. మరోవైపు అంజలి నీ పేరు తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా సుమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి నటించబోతున్నాడట. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ అదే కనుక నిజమైతే బాలయ్య కు సరైన విలన్ దొరికినట్టే అంటున్నారు అభిమానులు.