ప్రముఖ సింగర్ సునీత గత సంవత్సరం రామ్ వీరపనేని అనే ప్రముఖ మీడియా వ్యక్తి, వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉంటుంది. తన ఫోటోలు, తన వర్క్, అలాగే తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులకి మరింత దగ్గరవుతుంది.
అయితే, ఇటీవల సునీత తమ ఫార్మ్ హౌస్‌లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ ఓ ఫోటోను పోస్టు చేసింది. దానికి క్యాప్షన్‌గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. దీంతో సునీత తల్లికాబోతోందా? అందుకే మామిడిచెట్టు వద్ద తీయించుకున్న ఫోటో పంచుకుందా? అనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక, ఈ వార్తలు సునీత దృష్టికి రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఓ వెబ్ సైట్‌లో సునీత తల్లి కాబోతుందంటూ రాసిన వార్తను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఘాటుగానే స్పందించింది.
‘దేవుడా.. జనాలు ఇంత క్రేజీగా ఉన్నారేంటి. మామిడి కాయలతో ఫోటో దిగి పోస్ట్ చేస్తే ఏదేదో ఊహించుకొని రాసేశారు. దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకండి. మీకో దండం రా నాయనా’అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సునీత తల్లి కాబోతుంది అనే వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.