విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతుందన్నారు కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ. విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి రావడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ప్రధాని హోదాలోనే కదా మోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారని గుర్తు చేశారు.
మళ్లీ వైజాగ్ లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపన కు వస్తున్నారని నిలదీశారు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్న మోదీ, జగన్ పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంఖుస్థాపనకి రావాలి అనుకుంటే అమరావతిలో మోదీ శంఖుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ల చేతులతోనే తీసేయాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులoటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం మాకు ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరం. దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి , రెండో రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది ఉంది. అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
