తమ్మినేని సీతారాం స్పీకరా, బ్రోకరా అంటూ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఏ పి ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేనిపై విజయవాడ పోలీస్ కమీషనర్ తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ మంత్రులు, స్పీకర్ బాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీ ని కోరినట్టు తెలిపారు పద్మ శ్రీ. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పీకర్ ను బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.