2019 సంవత్సరం ముగుస్తుండడంతో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పండుగ మూడ్ లోకి వెళ్లిపోయారు. యూదుల పండుగ హనుక్కా వేడుకలను ప్రారంభించారు. పిల్లలతో ఉన్న పండుగ ఫోటోలను సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బొమ్మ రైలు మీద క్యాండిల్స్ ఉంచిన ఫోటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేసి దాని మీద ” ప్రతి ఒక్కరికి హనుక్కా మొదటి రోజు శుభాకాంక్షలు! లవ్ నిషా, నోహ్, అశర్ వెబర్! అని ట్వీట్ చేశారు. సన్నీ పంజాబ్ కుటుంబానికి చెందినప్పటికీ ఆమె భర్త డేనియల్ వెబర్ యూదుడు. హనుక్కా ఎనిమిది రోజుల పండుగ. డిసెంబర్ 22న మొదలై డిసెంబర్ 30 తో ముగుస్తుంది. హనుక్కా దీపాల పండుగగా కూడా ప్రసిద్ధి. గత ఏడాది కూడా సన్నీ లియోన్ తన హనుక్కా వేడుకల ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.