సోషల్ మీడియాలోనే కాదు, ఇంటర్నెట్ ప్రపంచంలోనూ ఇతర సెలబ్రిటీల కన్నా సన్నీ లియోన్ ఎంతో ముందే ఉంది. ఆమె కోసం నెటిజన్లు నెట్‌లో ఎక్కువగా వెదుకుతుంటారు. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆమె తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
స్ప్లిట్స్ విల్లా తాజా సీజన్ కోసం సన్నీ లియోన్ తాజాగా రణ్‌విజయ్ సింఘతో కలిసి కేరళలో ఒక చోట షూటింగ్‌లో పాల్గొంది. అందులో భాగంగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతూ ఫోటో తీసుకుంది. ఆ ఫొటోలో సన్నీ లియోన్ బ్లూ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉండగా.. తలపై సన్నీ లియోన్ అని తన పేరు రాసి ఉన్న ఓ టోపీని కూడా ఆమె ముఖం కవర్ అయ్యేలా ధరించింది. ఆ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోకు ఇప్పటికే 6.69 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అభిమానులు ఆ ఫొటోను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
కాగా సన్నీ లియోన్ ఇటీవలే తన కవల పిల్లలు నోవా, ఆషర్‌లకు 3వ బర్త్ డే వేడుకలను నిర్వహించింది. ఆ కార్యక్రమానికి చెందిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. సన్నీ లియోన్ నటించిన బుల్లెట్స్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే లాంచ్ అయింది. ఇక ఆమె త్వరలో అనామిక అనే మరో సిరీస్‌లో కనిపించనుంది. యాక్షన్ నేపథ్యంలో ఆ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లలో సిరీస్ ఉంటుంది. దానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా, సోనాలి సెయ్‌గల్ నటిస్తున్నారు.