సన్నీలియోన్ ఈ పేరు చెప్పగానే దాదాపుగా సినీ ప్రేక్షకులు అందరూ ఒక ఐడియా కి వచ్చేస్తారు. కానీ ఇక్కడ విషయం అది కాదు. కలకత్తా లోని అఘతోష్ కాలేజీ ప్రకటించిన 12వ తరగతి బోర్డు పరీక్షలు మెరిట్ జాబితాలో సన్నీ లియోన్ టాప్ ప్లేస్ సాధించింది. అంతే కాదు రోల్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఆమెకు వచ్చిన మార్కుల జాబితాను కూడా ఈ లిస్టులో పొందుపరిచారు. ఇంకో విశేషం ఏంటంటే సన్నీలియోన్ కు నాలుగు సబ్జెక్టులలో వందకు వంద మార్కులు వచ్చాయి. ఈ పోస్ట్ తిరిగి తిరిగి సన్నీలియోన్ కి చేరింది.
See you all in college next semester!!! Hope your in my class 😉 😆😜
— sunnyleone (@SunnyLeone) August 28, 2020
ఇదే విషయమై ట్వీట్ చేస్తూ కాలేజీ నెక్స్ట్ సెమిస్టర్ లో మీ అందర్నీ కలుసుకుంటా మీరంతా నా క్లాస్ లో ఉంటారని భావిస్తున్నాను అంటూ ఫన్నీ గా ట్వీట్ చేసింది. దీంతో కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ ఎవరో ఆకతాయిలు ఇది కావాలని చేశారని వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.