కరోనా భయానికి ఐపీఎల్ ను దుబాయ్ కి మార్చినా వైరస్ మాత్రం వదలటం లేదు. గత వేసవిలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్ ను వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పుడు రెండ్రోజులుగా మిగతా మ్యాచులను నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 7.30గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగాల్సి ఉంది.
అయితే, సన్ రైజర్స్ లో కీలక బౌలర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఉలిక్కిపడ్డ ఐపీఎల్ నిర్వాహకులు హైదారాబాద్ టీం సభ్యులతో పాటు నటరాజన్ కు సన్నిహితంగా వారికి టెస్టులు చేశారు. కానీ అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇటు ఢిల్లీ ఆటగాళ్లకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో మ్యాచ్ ను యాధాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు.