దేశంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం , కోణార్క్ సూర్యానారాయణ స్వామి ఆలయాలు తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచిన ఆలయం కృష్ణాజిల్లా చిక్కవరం ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ దేవస్థానం.
శనివారం రథసప్తమి పండుగ పురస్కరించుకుని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలు తాకాయి. చిక్కవరం దేవస్థానం విశేషం తెలుసుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, విజయవాడ చుట్టుపక్కల ప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శించుకున్నారు.
ప్రధాన అర్ఛకులు వంశీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచే మూలమూర్తులకు పంచామృతవిశేష అభిషేకం , మూలమూర్తులకు కిరణోత్సవం , సూర్య నమస్కారాలు ,అరుణ పారాయణం , ఏకకాలంలో సూర్య హోమం , శాంతి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం భక్తలకు అన్న సమారధన నిర్వహించారు.
సూర్య కిరణాల దర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలయ నిర్మాణ దాత ముక్కామల పండుమ్మ దగ్గరుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ రోజున స్వామి వారి ని దర్శించుకుంటే భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం , రైతులకు పాడి పంటలు సమృద్ధి పండుతాయని ఆర్ఛకులు తెలిపారు. రథసప్తమి రోజు స్వామి వారి పాదలు తాకిన సూర్య కిరణాలు దర్శనం తమకెంతో ఆధ్యాత్మిక భావాన్ని కలిగించాయని భక్తులు చెబుతున్నారు.