బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షులముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ, కీలక పాత్రల్లో నటించారు.
ఇక డిసెంబర్ 2 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షుల ముందుకు వచ్చి 45 రోజులు అవుతుంది. కాగా ఈ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంక్రాంతి పండుగ రోజు మంచి వసూళ్ళని సాధించింది. ఆ ఒక్కరోజే 2 లక్షల రూపాయలు వసూళ్లు చేసింది.
కరోనా కూడా అఖండ వసూళ్లు చూసిన విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.