మళయాల మూవీలు తెలుగులో రీమేక్ కావటం కొత్తేమీ కాదు. కానీ అక్కడ బ్లాక్ బాస్టర్ అయిన కథలన్నీ తెలుగులో వర్కవుట్ కావాలన్న గ్యారెంటీ ఏమీ లేదు. ముఖ్యంగా మళయాల నేపథ్యంలో సాగే కథలకు బ్లాక్ బాస్టర్ హిట్ కు ఎంత అవకాశం ఉంటుందో, బొల్తా కొట్టడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది.
మళయాలంలో సూపర్ హిట్ మూవీ అయ్యప్పునం కోషియం గురించి. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునేందుకు పలువరు నిర్మాతలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట. కానీ కథను జాగ్రత్తగా తెలుగు నెటివిటీకి సరిపోయేలా హ్యాండిల్ చేయలేకపోతే… మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుందట.
అయితే, బాలయ్య-రానాలతో కలిసి ఈ సినిమా తీసేలా సరైన తెలుగు కథ రాయగలిగితే… ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట తెలుగు టాప్ నిర్మాతలు. కానీ కథను పర్ ఫెక్ట్ గా హ్యండిల్ చేసే వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.