జాతి రత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. అనుదీప్ దర్శకత్వం తో వచ్చిన ఈ సినిమా లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి…. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం లో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం టైటిల్ టీజర్ ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ టీజర్ కు యూ ట్యూబ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
అంతేకాక ఈ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా…సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.