అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలంతా కలిసి చేసిన సినిమా మనం. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు కు ఇది ఆఖరి సినిమా కావటంతో నాగార్జున, చైతు, సమంత, అఖిల్ ఇలా అందరూ ఆ సినిమాలో నటించారు. ఇక పోతే మంచు ఫ్యామిలీ కూడా ఇలానే ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం ఇలాంటి సినిమాతో రాబోతోందా అంటే అవుననే వినిపిస్తుంది.
సీనియర్ సూపర్ స్టార్ కృష, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరూ కూడా ఈ సినిమాలో నటిచనున్నారని సమాచారం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు కనిపించనున్నారు. కృష్ణ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్నారట. అంతే కాకుండా నమ్రత, మహేష్ పిల్లలు కూడా నటించనున్నారని ఫిలింనగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
గతంలో మహేష్ బాబు, కృష్ణ చాలా సినిమాలు తీశారు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు, గౌతమ్ నటించారు. అప్పట్లో మహేష్ బాబు, నమ్రత వంశీ చిత్రంలో నటించారు. ఇప్పుడు వీరంతా ఒకే సారి వెండితెరపై కనిపిస్తారనే వార్త షికార్లు కొట్టటంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.