డాడీకి న్యూ లుక్ చూపాలని వెళ్తే..అక్కడ హీరోయిన్ పోటీ పడింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార కొత్త లుక్ లో కనిపిస్తోంది. రింగులుగా ఉన్న తన జుట్టును మార్చుకుని క్యూట్ గా మారింది. తన న్యూ లుక్ ని డాడీ మహేష్ కి చూపడానికి ఆయన నటిస్తున్న ” భరత్ అనే నేను ” మూవీ సెట్స్ కు వెళ్ళింది. ఈ విషయాన్ని సితార తల్లి, మహేష్ భార్య నమ్రత తెలిపింది. సితార తన కొత్త హెయిర్ స్టయిల్ ని డాడీకి చూపాలని వెళ్ళింది..ఇది పిల్లల సమయం అని ట్వీట్  చేయడమే గాక.. కూతురితో కలిసి దిగిన  సెల్ఫీని పోస్ట్ చేసిందామె. పైగా ” లేజీ సండే ” అనే  హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసి తన మురిపెం తీర్చుకుంది నమ్రత. ఇక్కడితో సితార ” ప్రయాణం ” ఆగలేదు. భరత్ అనే నేను మూవీ సెట్స్ కు వెళ్ళగానే అక్కడ హీరోయిన్ కైరా అద్వానీ ఆమెకు తారస పడింది. ఈ చిన్నారిని చూసిన కైరా కూడా ఐసై పోయి..ఆప్యాయంగా ముచ్చటించింది. ఈ ఫోటోను కూడా నమ్రత పోస్ట్ చేస్తూ.. ” ఎవరి జుట్టు పొడవుగా ఉంది ? భరత్ అనే నేను సెట్ లో అందమైన కైరాతో లాంగెస్ట్ హెయిర్ అవార్డుకు పోటీ జరుగుతోంది. ఇద్దరు అందగత్తెలు ” అని  చమత్కరించింది.