కీరవాణి… ఎంతో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. బాహుబలి-2తో ఇక సినిమాలకు మ్యూజిక్ చాలు అని రిటైరయ్యేందుకు కీరవాణి డిసైడ్ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు రాజమౌళితో పాటు ఇతర సన్నిహితుల ఒత్తిడితో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తన్నాడు కీరవాణి.
ఆర్.ఆర్.ఆర్ కు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ పిరియాడికల్ మూవీకి కూడా కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. దీంతో ఒక్క మహేష్ బాబు మినహా ఇప్పుడున్న టాప్ హీరోలందరితోనూ కీరవాణి పనిచేసినట్లయ్యింది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తానంటూ ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి సినిమా అంటే కీరవాణి మ్యూజిక్ ఉన్నట్లే. కానీ పవన్ సినిమా తర్వాత ఇక ఎవరూ ఒత్తిడి చేసినా రిటైరవ్వాల్సిందేనని, ఇప్పుడు చేతిలో ఉన్న రెండు సినిమాలకు అత్యుత్తమ మ్యూజిక్ అందించి కెరీర్ ను గొప్పగా ముగించాలన్న ఆలోచనతో కీరవాణి ఉన్నారని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.