ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన నటిస్తోంది.
ఇదిలా ఉండగా మహేష్ బాబు, భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇటీవల సోషల్ మీడియా కూడా పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. ఇక తాజాగా మహేష్ తన కొత్త లుక్ ఫోటో ను షేర్ చేశారు నమ్రత. ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇందులో మహేష్ చాలా స్టైల్ గా కనిపించాడు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.