అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు.మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో పదమూడు సంవత్త్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి కూడా వెండితెర మీద కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కి సంబంధించి నెల ఆఖరికి షూటింగ్ పూర్తవుతుంది. మరి నెక్స్ట్ ఏంటనే ఆలోచనలో పడ్డాడట మహేష్ బాబు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, మహర్షి సినిమా దర్శకుడు పైడిపల్లి వంశీ మహేష్ తో సినిమా చెయ్యటానికి రెడీ గా ఉన్నప్పటికీ కథ లు మాత్రం సిద్ధంకాలేదట. దీనితో ఏమి చెయ్యాలో తోచక డైరెక్టర్ల వెంటపడుతున్నాడంట మహేష్. మహర్షి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన వంశీ పై మహేష్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఎలాగైనా సరే సంక్రాంతి లోపు మరో సినిమాని పట్టాలు ఎక్కించాలనే ఆలోచనలో ఉన్న మహేష్ దొరికిన కథలు దొరికినట్టుగా వింటున్నాడట. మరి మహేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.