మహేష్ బాబు సరిలేరు నికేవ్వరుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్బారు. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమా. అయితే సినిమా గెలుపోటములను పెద్దగా పట్టించుకోకుండా మహేష్ బాబు తన జర్నీని కొనసాగిస్తుంటారని చాలామంది అంటుంటారు. ఎక్కడ ఎమోషనల్ అవ్వకుండా కూల్ గా కనిపిస్తారని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. సమయం వచ్చినప్పుడు మహేష్ భావోద్వేగాలను ఎలా నియత్రించుకొని ఉంటాడో మరోసారి ప్రూవ్ అయింది.
సరిలేరు ‘నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్పాంటేనియస్ గా సమాధానాలు ఇచ్చారు మహేశ్. ఓ అభిమాని మహేష్ బాబును బ్లాక్ బస్టర్ కాఫీ ఎక్కడ తాగారని ప్రశ్నించాడు. ఇందుకు స్పందిస్తూ… ప్రతి సినిమా రిలీజ్ ముందు సెంటిమెంట్ గా అమ్మ కలిపి ఇచ్చే కాఫీ తాగుతానని.. బ్లాక్ బస్టర్ కాఫీ అంటే ఆవిడ కలిపి ఇచ్చేదన్న విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాతో తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అర్ధమైందని తెలిపారు. తన నుంచి అప్పుడప్పుడు మాస్ సినిమాలను ఆశిస్తున్నరనే విషయం అర్ధమైందని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని ఊహించలేదని స్పష్టం చేశారు.
అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు మహేష్ . తన గత సినిమాలు అన్ని ప్రత్యేకమైనవేనని… అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం మరింత స్పెషల్ అని చెప్పారు. అయితే.. ఈ సినిమాకు రేటింగ్ ఎంత ఇస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా మహేష్ బాబు దాటవేశారు. ఈ విషయాన్నీ బట్టి చూస్తే మహేష్ తాను ఎంత ఆనందంలో ఉన్న ఎప్పుడు ఒకేలా ఉండటం తన లక్షణమని మరోసారి చాటిచెప్పారు.