సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది పసి పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయించి ప్రాణాలను నిలబెట్టాడు. వారి పాలిట దేవుడు అయ్యాడు. తాజాగా మహేష్ మరో బాబుకి ఊపిరి పోశాడు. షేక్ రిహాన్ అనే బాబుకి ఆపరేషన్ కోసం సహాయం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు. టెట్రాలజీ ఆఫ్ ఫాలుట్ కోసం చేసిన ఆపరేషన్ విషయం కావడంతో షేక్ రిహాన్ తల్లిదండ్రులు మహేష్ కు ధన్యవాదాలు తెలిపారు. షేక్ రిహాన్ ఇప్పుడు స్థిరమైన స్థితిలో ఉన్నారని విన్నందుకు సంతోషంగా ఉందని డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు వారాల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనుందని సమాచారం.