కరోనా మహమ్మారీ భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని, నలుగురిలో కలవకుండా కొద్ది రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వండి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా ద్వారా తనను అభిమానించే వారందరిని రిక్వెస్ట్ చేస్తున్నానన్న మహేష్… ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత, సముహాలుగా కలవకపోవటం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ సమయాన్ని మనం ప్రేమించే వాళ్లు, కుటుంబంతో గడుపుదాం అంటూ కోరారు. అందరూ తరచూ చేతులు కడుక్కోండి… మాస్క్‌లు వేసుకోవటంతో పాటు ఈ కరోనా భూతం వెళ్లిపోయే వరకు జాగ్రత్తగా ఉండి, కలిసికట్టుగా కరోనాను ఎదుర్కుందాం అని కారారు.