ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ ఫాన్స్‌కు సంక్రాంతి పండుగను ముందే తీసుకరాబోతుంది. రజినీ-మురగదాస్ కాంబినేషన్ కావటంతో సినిమాపై పెట్టుకున్న హైఎక్స్‌పెక్టేషన్‌ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేసినప్పటికీ… డైరెక్టర్ తన మార్క్ చూపించటం కన్నా రజినీ స్థాయిని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాడని అర్థం అవుతోంది.
చాలా రోజుల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనపడుతున్నారు. ఇక అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎంతో ప్లస్‌గా నిలుస్తోంది. సంతోషన్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌గా నిలవబోతుంది. సెకండ్ ఆఫ్‌తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్లస్ అవుతుండగా.. ఫస్ట్ ఆఫ్ మొత్తం రజినీ వన్ మ్యాన్ షో ఉంటుంది. రజినీకాంత్ సరసన నటించిన నయనతారకు ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా మెరిసే అవకాశం లేదు. సెకండ్ ఆఫ్ మాత్రం కొంత స్లోగా సాగుతుంది.
ఇక రజినీకాంత్ కూతురుగా నటించిన నివేదా థామస్ యాక్టింగ్ బాగుంటుంది. అయితే చివర్లో ఇంకాస్త గ్లామర్‌గా నటించే స్కోప్ ఉన్నట్లు కనపడుతుంది. మెట్రో స్టేషన్ వద్ద జరిగే ఫైట్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంది. తళైవా రజినీ ఫాన్స్ అందరికీ ఈ సంక్రాంతి పండుగకు ఫుల్ మీల్స్ దొరికనట్లే. చాలా రోజుల తర్వాత రజినీకాంత్ ఇచ్చిన డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు.
రోజా ముందే జగన్ డైలాగ్‌పై జబర్ధస్త్ సెటైర్స్
చిరు-విజయశాంతితో మహేష్ వైఫ్ అలక
Advertisements
ఆకాశమే నీ హద్దురా టీజర్ అదిరిందిగా