రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ వెనక్కి తగ్గడంపై తమిళనాట ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా ఫ్యాన్స్ చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పొలిటికల్ ఎంట్రీ మేటర్‌పై ఇప్పటికీ అభిమానులు డిమాండ్ చేస్తుండటంతో.. రజనీకాంత్ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని.. ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
రజినీ మక్కల్ మంద్రమ్ నుంచి బహిష్కరణకు గురైనవారితో కలిపి ఫ్యాన్స్ కొందరు చెన్నైలో ప్రదర్శన నిర్వహించారని లేఖలో ప్రస్తావించిన రజనీకాంత్.. తనంటే గిట్టనివారితో కలిసి అలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని బాధపడ్డారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృత్తం చేయొద్దని కోరారు. ఇందుకు సంబంధించిన లేఖను ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు రజనీకాంత్.
— Rajinikanth (@rajinikanth) January 11, 2021