సినిమా హీరోలకి ఉన్న క్రేజే వేరు. అభిమానులకు వారు దాదాపు దైవసమానులు. వాళ్ళని దగ్గర నుంచి చూడడమే అదృష్టం. వాళ్ళతో జీవితాన్ని పంచుకోవడమంటే వాళ్ళ సంతోషం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.
ఐతే ఫ్యాన్స్ తో ప్రేమలో పడిన హీరోలు కూడా లేకపోలేదనుకోండి..! స్థాయి, సంపదలతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతుంది..ప్రేమకి సెలబ్రిటీలు అతీతులు కారు…కానీ స్టార్ డమ్ ని అనుభవిస్తున్న సినిమా స్టార్స్ వారి అభిమానులతో ప్రేమలో పడడం చాలా అరుదు..అలాంటి అరుదైన ప్రేమకథలు..తమ అభిమానులనే పెళ్లి చేసుకున్న నటుల గురించి తెలుసుకుందాం.
రజనీకాంత్ –లత:
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రంగాచారి..వీరిద్దరి పరిచయం అనూహ్యంగా జరిగింది.. రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో ప్రేమలో పడ్డారు సూపర్ స్టార్…ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధినిగా ఉన్నప్పుడు లత సూపర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేశారు.ఆ పరిచయం ప్రేమగా మారి..వారి వివాహం 26 ఫిబ్రవరి 1981 న తిరుపతిలో జరిగింది.
విజయ్ – సంగీత:
తమిళ నటుడు విజయ్ ని ఒక సినిమా షూటింగ్లో కలిసింది సంగీత..విజయ్ అన్నా,తన యాక్టింగ్ అన్నా పిచ్చి అభిమానం అని చెప్పడంతో, ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నంబర్ ఇచ్చాడు విజయ్..ఆ పరిచయం ఫోన్ కాల్స్,ఛాటింగ్స్ వరకు వెళ్లింది.తర్వాత సంగీతని తన ఇంటికి ఇన్వైట్ చేసి,ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాడు..పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు..
మాధవన్ – సరితా బిజ్రే:
సఖి, యువ , అమృత ఇలా ఎన్నో చిత్రాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్ గా మారిన నటుడు మాధవన్…తన భార్య సరితా బిజ్రేని కమ్యునికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలుసుకున్నారు…నటనకు ముందు మాధవన్ కమ్యునికేషన్ స్కిల్స్ కి సంబంధించిన క్లాస్ టీచ్ చేసేవాడు..అక్కడ స్టూడెంట్ గా ఉన్న సరితా బిజ్రేకి మాధవన్ క్లాస్ పట్ల ప్రత్యేక ఆసక్తి కనపర్చేది..మాధవన్ టీచింగ్ స్కిల్స్ పట్ల అట్రాక్ట్ అయిన సరితా..తర్వాత మాధవన్ తో ప్రేమలో పడింది..వివాహం చేసుకున్నారు.
ఈషా డియోల్ – భరత్ తక్తాని:
ఈషా డియోల్ , భరత్ తక్తాని అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది..అంతకన్నా ముందు ఈషా డియోల్ కి భరత్ పెద్ద ఫ్యాన్..
రాజేష్ కన్నా – డింపుల్ కపాడియా:
బాబీ సినిమాతో బాలివుడ్లో అడుగుపెట్టన నటి డింపుల్ కపాడియా..అదే ఏడాది బాలివుడ్ యాక్టర్ రాజేశ్ కన్నాని పెళ్లిచేసుకుంది.అప్పటికి రాజేశ్ కన్నా సినిమాల నుండి రిటైర్ అయిపోయారు..కానీ రాజేష్ అంటే ఉన్న అభిమానంతో తనని పెళ్లిచేసుకుంది డింపుల్ ..వారి కూతురే ట్వింకిల్ కన్నా..అక్షయ్ కుమార్ భార్య.