మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేల్స్ ఇటీవల రోటీ తయారు చేశారు. రోటీ ఎలా చేయాలో ప్రముఖ ఫుడ్ వ్లాగర్ బెర్నాథ్ చెబుతుండగా వింటూ బిల్ గేట్స్ రోటీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
వీడియోలో… రోటీ ఎలా చేయాలో బిల్ గేట్స్ కు బెర్నాథ్ నేర్పించారు. బెర్నాథ్ తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దానిలో నెయ్యి వేసుకుని తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోటీ తయారు చేసినందుకు బిల్ గేట్స్‌ను ప్రధాని అభినందించారు. మిల్లెట్ల వినియోగించాలంటూ కోరారు. దేశంలో తాజాగా మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తోందన్నారు. మిల్లెట్ల్స్ ఆరోగ్యానికి చాలా మంచివని ప్రధాని మోడీ బిల్ గేట్స్ కు సూచించారు. దీంతో పలు రకాల వంటకాలు తయారు చేయవచ్చన్నారు.
ఇటీవల దేశంలో మిల్లెట్స్ ఉత్పత్తులకు మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది. మిల్లెట్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. అందుకే మిల్లెట్స్‌తో ఏదైనా వంటకాలు తయారు చేయాలని బిల్ గేట్స్‌కు మోడీ సూచించారు.