మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో కరోనా నివారణకు పాఠాలు చెప్పింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇదివరకే మహేష్ బాబు కరోనా మన దరికి చేరకుండా ఉండాలంటే ఆరు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించగా.. సితార తన తండ్రికి ధీటుగా ఐదు జాగ్రత్తలు చెప్పి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన 5 మార్గాలను అందరు తప్పక పాటించాలని ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఇంట్లోనే ఉండి..సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పింది. మాటిమాటికీ చేతులను శుభ్రం చేసుకోవాలని..చేతులను కడిగే సమయంలో 30 సెకన్లపాటు వాష్ చేయాలని చెప్పింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచితిని అడ్డుపెట్టుకోవాలని కోరింది ఘట్టమనేని గారాలపట్టి. ఇంటికి దగ్గరలోని వారితో కుడా ఎక్కువ సమయం గడపకూడదని..వారికీ మూడు మీటర్ల దూరం పాటించాలని చెప్పింది. అలాగే వైద్యులు సూచించినట్టుగా నోరు,ముక్కు,చెవులు తాకరాదని చెప్పింది. ఒకవేళ ముక్కు,నోటికి తాకిన వెంటనే సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సితార చెప్పిన ఈ వీడియోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పిల్లలు చెప్పిన బంగారం లాంటి మాటలను అందరు వినండని కామెంట్ చేసాడు మహేష్.
Golden rules!! When kids speak…u listen…#StayHomeStaySafe ???? pic.twitter.com/v8Ih3ps8D0
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2020