చిత్తూరు జిల్లా మదనపల్లె శివనగర్‌లో దారుణం చోటు చేసుకుంది.ఆధ్యాత్మికత పేరుతో పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు కూతుళ్లను అంతమొందించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి చెందిన వి.పురుషోత్తం నాయుడు పద్మజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పురుషోత్తమ నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తుండగా, పద్మజా పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నడుపుతోంది.
వీరిద్దరికీ సాయిదివ్య, అలేఖ్య అనే ఇద్దరు కుమార్తలు ఉన్నారు. క్షుద్రపూజలపై విపరీతమైన నమ్మకమున్నా పురుషోత్తం నాయుడు, పద్మజ లు వారి ఇంటి చుట్టు పక్కల ఎవరిని ఇంటిలోకి రానీకుండా ఎవరితో కలవకుండా వ్యవహరించేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీరి ఇంటి నుంచి గంటలు మోగినట్లు పెద్ద శబ్దం వచ్షినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాయంత్రం స్థానికులకు వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం బయటపడింది. చిన్న కుమార్తె అలేఖ్యను మధ్యాహ్నమే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఇనుప ఆయుదంతో తలపై మోదీ హత్య చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం పెద్ద కుమార్తె సాయిదివ్యను పూజ గది లోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి ఇనుప ఆయుధంతో తలపై మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే మదనపల్లె డి ఎస్ పి రవిమనోహర్ ఆచారి సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్నంగా పరిశీలించారు. పురుషోత్తం నాయుడు పద్మజలను విచారించగా వింత సమాధానాలు చెబుతున్నారు. తమ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని తమ ఇద్దరు కుమార్తెలు ఉదయానికల్లా తిరిగి లేచి వస్తారని చెబుతున్నారు. ఒక యువతి ఎంబిఎ పూర్తి చేయగా, మరో యువతి రెహమాన్ మ్యూజిక్ ఇన్ స్టి ట్యూట్ లో విద్యార్థిని.