దేశంలో కరోనా లాక్ డౌన్ నుండి మూతపడ్డ అంగన్ వాడీలు ఇంకా తెరుచుకోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూసివేసే ఉన్నాయి. అయితే, చిన్నారులకు పౌష్ఠికహారం అందించే సదుద్దేశంతో మొదలైన అంగన్ వాడీ కేంద్రాలు దాదాపు సంవత్సరకాలంగా మూసివేసి ఉండటంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది.
కరోనా అధికంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లు మినహా… ఇతర ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాలను ఓపెన్ చేయటంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాలను ఆదేశించింది. జనవరి 31లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.