తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులను నియమించారు. ఈమేరకు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. కొత్త జడ్జిలుగా ఈవీ వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, ఖాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావులు నియమితులయ్యారు.
మొత్తం తెలంగాణలో జడ్జిల సంఖ్య 42. ఇప్పటివరకు 27 మంది ఉన్నారు. 2021 నుంచి ఇప్పటిదాకా 17 మంది న్యాయమూర్తులను నియమించింది కొలీజియం. విభజనకు ముందు వరకు పది మంది జడ్జిలు మాత్రమే ఉండే వారు. 2021 తర్వాత నియామకాల్లో స్పీడ్ పెరిగింది.
పాతవారితో కలిపి మరో 17 మందిని సిఫారసు చేసింది కొలీజియం. దీంతో ప్రస్తుతం మొత్తం 27 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో 27 మందికి మరో ఆరుగురు జడ్జిలు యాడ్ అయ్యారు. సంఖ్య 33కు చేరింది.
హైకోర్టులో 41వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నింటిని త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో న్యాయమూర్తుల నియామకాన్ని వేగవంతం చేసింది సుప్రీం కొలీజియం. హైకోర్టులో మరో 9 ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేసే ఛాన్స్ ఉంది.