-దర్యాప్తుపై స్టేటస్- కో ఇచ్చిన సుప్రీం కోర్టు
-జూలై 31కి విచారణ వాయిదా
-అప్పటి దాకా సిట్ రికార్డులు ఇవ్వాల్సిన పని లేదు
-ధర్మాసనం వెల్లడి
– నాలుగు నెలల్లో ఏ మలుపు తిరిగేనో..!
-ఆసక్తిగా మారుతున్న కేసు
తొలివెలుగు క్రైం బ్యూరో.
దేశంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పై సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది. కేసు రికార్డులను సిట్ ఇవ్వడం లేదన్న సీబీఐ వాదనను తోసిపుచ్చింది. న్యాయస్థానాల పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు రికార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెల్చి చెప్పింది.
దర్యాప్తు పై స్టేటస్ కో విధిస్తూ అదేశాలు జారీ చేయడంతో సిట్ కు భారీ రిలీప్ దొరికింది. సీబీఐ అత్యుత్సాహాంగా వ్యవహారిస్తోందన్న తెలంగాణ సర్కార్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.
ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పై అనుమానాలు ఉన్నందున ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ముగ్గురు నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పటిగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు వెల్లడించింది.
దీనిపై రివ్యూ పిటిషన్ వేయగా ఆ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. హైకోర్టు తీర్పు పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లింది. అప్పీల్‌లో బలమైన వాదనలు వినిపించడంతో ఇప్పుడు విచారణను సమ్మర్ హాలీడేస్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. దీంతో కేసు విచారణ భవిష్యత్త్‌లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.