రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై మార్చి9న విచారణ చేపట్టనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఈ పిటిషన్ కు సంబంధించి వాదనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఏఎస్ బోపన్నా, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం వింటుందని పేర్కొంది.
రామసేతును జాతీయ పురాతన స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ మాన్యు మెంట్స్ అథారిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.
రామసేతును జాతీయ ప్రాధాన్యత గల పురాతన చిహ్నంగా భావించి దీనిపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించేలా భారత ప్రభుత్వం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలను ఆదేశించాలని పిటిషన్ లో సుప్రీం కోర్టుకు విన్నవించారు.